ఎస్కేయూలో వీసీ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైస్ ఛాన్సలర్.. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల పరిశీలన..
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ బుధవారం విశ్వవిద్యాలయంలోని గ్రామీణాభివృద్ధి విభాగంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా తరగతి గదులను సందర్శించి విద్యార్థుల హాజరు, అధ్యాపకుల బోధనా తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా తరగతిలో బోధిస్తున్న పాఠ్యాంశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాకపోవడంతో ఆయా అంశాలను స్వయంగా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. పాఠ్యాంశాలను కేవలం బట్టీ పట్టడం కాకుండా, వాటిపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ఉపకులపతి సూచించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్