BREAKING
టెస్టు క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన 20 ఏళ్ల ఆఫ్ఘన్ ఆల్ రౌండర్.. జింబాబ్వేపై నసీర్ ఖాన్ వీరోచిత పోరాటం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది విద్యార్థినులకు చికిత్స!! వైభవంగా శ్రీ సత్య సాయి బాబా రథోత్సవం పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం.. రికార్డు స్థాయిలో పదోసారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం కొత్త జేమ్స్ బాండ్ పాత్రపై దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్ సంచలన వ్యాఖ్యలు.. 007 ఒక గూఢచారి కంటే ఎక్కువగా హంతకుడు అని వెల్లడి నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. మెరుపు శతకంతో చెలరేగిన బెన్ డకెట్, భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్ ఎస్కేయూలో వీసీ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు పాఠాలు బోధించిన వైస్‌ ఛాన్సలర్.. తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల పరిశీలన.. పుల్లగూరపల్లి పంచాయతీ సర్పంచి విజయ నాగేంద్ర ఏకగ్రీవం ఐపీఎల్ 2027 మినీ వేలానికి సర్వం సిద్ధం.. ఫ్రాంచైజీలు వదిలేసిన ప్రముఖ ఆటగాళ్ల జాబితా విడుదల పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహన సదస్సు కార్యక్రమం ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటరు జాబితా ప్రక్రియకు సవరించిన షెడ్యూల్ : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పాపన్ పేట్ లో జనసురక్ష,అవగాహనసదస్సు కార్యక్రమం.… భారత్ - పాలస్తీనా ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. భారత కెప్టెన్‌పై అనుచిత ప్రవర్తన, పాలస్తీనా ఆటగాడిపై తీవ్ర విమర్శలు ధోని రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకు చేరువవుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో తెలుసా?

నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి

Select Suryaa Now
నేడు దుర్భాక రాజశేఖర శతావధాని జయంతి

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :

తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో అనేక రచనలు, హరికథలు , నవలలు, కావ్యాలు, నాటకాలు రచించిన కవిసార్వభౌముడు, దేశభక్తిని ప్రబోధిస్తూ తన సాహిత్యం తో ప్రజా చైతన్యం కోసం కృషి చేసిన మహానుభావులు దుర్భాక రాజశేఖర గారి జయంతి.

దుర్భాక రాజశేఖర
నవంబర్ 18, 1888 సర్వధారి సంవత్సర కార్తీక శుద్ధ పంచమినాడు కడప జిల్లా జమలమడుగు గ్రామం లో జన్మించారు. తండ్రి దుర్భాక వెంకటరామయ్య,తల్లి సుబ్బమాంబ.

1907లో కడప ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైనాడు.మద్రాసు క్రైస్తవ కళాశాలలో ఎఫ్.ఎ.చదువుతూ మధ్యలో ఆపివేశాడు.

1904-1907ల మధ్య కందాళ దాసాచార్యులు, జనమంచి శేషాద్రిశర్మ ల వద్ద సంస్కృతాంధ్రాలు, నాటకాలంకార శాస్త్రాలు ను
నేర్చుకొన్నారు. 1908 నుండి ప్రొద్దుటూరు లోని జిల్లా మునసబు కోర్టులో గుమాస్తాగా పనిచేసి గాంధీ ఉద్యమ ప్రభావంతో 1921లో ఉద్యోగం మానివేశాడు.

ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు. 1928లో వైస్ ఛైర్మన్‌గా ఉన్నాడు. 1927-1932 ల మధ్య ప్రొద్దుటూరు తాలూకా బోర్డు ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.మద్రాసు సెనేట్ సభ్యుడిగా, వేదపాఠశాల కార్యదర్శిగా సేవలను అందించాడు.

చరిత్రను కథావస్తువుగా చేసుకొని, దేశభక్తిని రేకెత్తించే మహాకావ్యాలు లేని కాలంలో దేశభక్తిని ప్రబోధిస్తూ దుర్భాక రాజశేఖర శతావధాని మొట్ట మొదట రాణా ప్రతాప సింహుని చరిత్రను1912లో దుర్భాక రాజశేఖర
‘రాణాప్రతాపసింహ చరిత్ర' అనే మహాకావ్యంగా మలచారు.

1912లో దుర్భాక రాజశేఖర శతావధాని కి గడియారం వేంకట శేషశాస్త్రి తో పరిచయం ఏర్పడింది. అది మైత్రిగా మారింది. 20వ శతాబ్దం ఆరంభంలో ఆంధ్ర దేశంలో జంట కవిత్వం ఒక వాడుకగా మారింది. తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవులను అనుసరించి అనేక మంది జంటకవులు బయలు దేరారు. ఆ పరంపరలో రాయలసీమకు చెందిక కవులు దుర్భాక రాజశేఖర శతావధాని , గడియారం వేంకట శేషశాస్త్రి ఇరువురూ “రాజశేఖర వేంకటశేషకవులు” పేరుతో జంటగా అవధానాలు చేయడం , కవితారంగం ప్రారంబించారు.ఈ కవులు ఇద్దరూ 1920-28ల మధ్య జంటగా అవధానాలు అసంఖ్యాకంగా చేశారు. వీటిలో అష్టావధానాలు, ద్విగుణిత అష్టావధానాలు, శతావధానాలు ఉన్నాయి.

కడప జిల్లా దాదిరెడ్డిపల్లె, ప్రొద్దుటూరు,జమ్మలమడుగు, నెమళ్ళదిన్నె, చెన్నూరు, కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ, అనంతపురం జిల్లాలోని గుత్తి తో పాటుగా నెల్లూరులో కూడా అవధానాలు చేశారు.

శరన్నవరాత్రి పద్యావళి, వీరమతి అనే కావ్యాలు జంటగా రచించారు. సువర్ణ కంకణాది ఘన సన్మానాల్ని అందుకున్నారు.

ఆ అవధాన జైత్రయాత్రా విశేషాల్ని స్పష్టపరిచే గ్రంథమే ‘అవధానసారం’.

ఈ జంటయాత్ర 1935 వరకూ నిరాఘాటంగా కొనసాగింది. తర్వాత వీళ్ళిద్దరూ స్వతంత్ర కావ్య రచనాభిలాష వల్ల విడిపోయారు.

రాణాప్రతాపసింహచరిత్ర,
అమరసింహచరిత్ర,వీరమతీ చరిత్రము,చండనృపాల చరిత్రము,పుష్పావతి,సీతాకల్యాణము (నాటకము),
సీతాపహరణము(నాటకము),
వృద్ధిమూల సంవాదము (నాటకము),
పద్మావతీ పరిణయము (నాటకము),విలయమాధుర్యము, స్వయంవరము, అనఘుడు, గోదానము, శరన్నవరాత్రులు
అవధానసారము, రాణీసంయుక్త (హరికథ),
తారాబాయి (నవల),టాడ్ చరిత్రము, రాజసింహ,  ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లంలో),కామేశ్వరీ స్తోత్రమాలా (సంస్కృతంలో) ఇలా అనేక రచనలు చేశారు.

అనేక సన్మానాలు, సత్కారాలు అందుకొన్నారు.
కావ్యకళానిధి, కవిసింహ, అవధాని పంచానస, కవిసార్వభౌమ, మహాకవి చూడామణి, వీరకవితా వీర, అభినవతిక్కన, వీరప్రబంధపరమేశ్వర, చారిత్రక కవిబ్రహ్మ, సుకవిరాజరాజ, కవితాసరస్వతి, వీరగాధా విధాత, చారిత్రక కవితాచార్య, వీరరస రత్నాకర, మహాకవి మార్తాండ బిరుదులు అందుకొన్నారు.

వీరి భార్య లక్ష్మమ్మ వీరికి ఇద్దరు సంతానం. కొడుకు కామేశ్వరయ్య, కుమార్తె కామేశ్వరీదేవి.

దుర్భాక రాజశేఖర శతావధాని
ఏప్రిల్ 30, 1957 న మరణించారు.