ఎన్నికల విధులు నిర్వహించిన వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలి.. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతపురం జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు..
(అనంతపురం కార్పొరేషన్ మేజర్ న్యూస్..)
అనంతపురం స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులుగా బీఎల్ఓ విధులు నిర్వహించి, ఓటర్ స్లిప్పుల పంపిణీతో పాటు పోలింగ్ రోజు ఎన్నికల విధుల్లో పాల్గొన్న వార్డు సచివాలయ ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలని కోరుతూ అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌ను అనంతపురం జిల్లా స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు కలిశారు.ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు గౌరవ వేతనం చెల్లించాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి, గౌరవ వేతనం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జేఏసీ నాయకులు డి. సుధాకర్, వి. లక్ష్మీనారాయణ, యు. మల్లికార్జున, ఎం.కె. వరప్రసాద్, సిరాల చంద్ర, చిన్నూరప్ప, శివ శంకరయ్య, రామకృష్ణ, రవికుమార్, మహేష్ నాయక్, వెంకటాద్రి, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.