ఈ నెల 20, 21 తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల మేళా
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్‌లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో (శుక్రవారం, శనివారం) నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక 'LRS మేళా' నిర్వహించను న్నట్లు తెలిపారు. ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లోనూ, బృందావన్ గార్డెన్స్ సర్కిల్ కార్యాలయంలోనూ పెండింగ్‌లో ఉన్న LRS ఫీజుల చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయడం.షార్ట్ ఫాల్ ఎండార్స్‌మెంట్ పత్రాల స్వీకరణ, తక్షణ పరిశీలన, టౌన్ ప్లానింగ్ అధికారులతో నేరుగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న దరఖాస్తులకు అక్కడి కక్కడే క్లియరెన్స్ మంజూరు చేస్తారన్నారు.దరఖాస్తుదారులు తమ దరఖాస్తుకు సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలు, గతంలో చెల్లించిన రసీదులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించుకునేందుకు నగరవాసులు ఈ ప్రత్యేక మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
సూర్య నాయక్