BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి: బట్టు రాజేశ్వర్

Select Suryaa Now
కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి: బట్టు రాజేశ్వర్
సూర్య బాల్కొండ: విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని బాల్కొండ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిహా అకాడమీ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆసక్తులు, అభిరుచులు, సామర్థ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా భవిష్యత్తు లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు. పదో తరగతి నుంచే కెరీర్‌పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు.కార్యక్రమంలో నిహా అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నిహా అకాడమీ ప్రతినిధి, MyNextStep కెరీర్ గైడెన్స్ యాప్ రూపకర్త అరుణ్ అడెపు విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఇంజనీరింగ్, మెడిసిన్, న్యాయశాస్త్రం, రక్షణ రంగం, ఐటీ, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు.అలాగే విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. JEE, NEET, CLAT వంటి ప్రవేశ పరీక్షలపై కూడా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్‌కు నిహా అకాడమీ హెడ్ పల్లవి సంగెం కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని పాఠశాలల్లో నిర్వహించేందుకు తమ అకాడమీ సిద్ధంగా ఉందన్నారు.విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వక్తలు ఆకాంక్షించారు.