BREAKING
భక్తిశ్రద్ధలతో శబరిమలకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముగిసిన మూట్ కోర్టు పోటీలు -విద్యార్థులలో అనుభవం కల్పించాలనే లక్ష్యం -న్యాయ అవగాహన కల్పించేందుకే ఈ పోటీలు -చైర్మన్ డా.ఆర్.తిప్పారెడ్డి టెలివిజన్ రంగంలో 2013 ఏడాదికి గాను పూర్ణగాధలు బెస్ట్ గ్రాఫిక్స్ కు నందిఅవార్డు విజయవంతంగా ముగిసిన నారెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షో ముఖ్య అతిథి గా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు -ఎన్డీఏపై నమ్మకంతో ప్రజల తీర్పు -వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నరసింహ యాదవ్ యుద్ధాలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచశాంతికి మార్గం రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పాలి పోలీసుల అదుపులో ఇద్దరు వైసిపి అభ్యర్ధుల భర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన 50 వైకాపా కుటుంబాలు పలాసలో ప్రశాంతంగా పోలింగ్ - 70.13 శాతం నమోదు 6న దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ 7వ షోరూమ్ ప్రారంభం - సినీ నటీమణులు స్రవంతి చొక్కారపు, దివి, కామాక్షి భాస్కర్ల వెల్లడి టీడీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ప్రచార జోరు మేఘవరంలో వైసీపీ అభ్యర్థుల ప్రచార జోరు జడ్పిటిసి అభ్యర్థి లక్ష్మీ తాయారును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కొండయ్య

కాచిగూడ–కృష్ణా రైలులో అపరిశుభ్రత తాండవం.. ప్రయాణికులకు కనీస టాయిలెట్ సౌకర్యాలు కరువు!

Select Suryaa Now
కాచిగూడ–కృష్ణా రైలులో అపరిశుభ్రత తాండవం.. ప్రయాణికులకు కనీస టాయిలెట్ సౌకర్యాలు కరువు!

                 రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు – ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి

కాచిగూడ నుంచి కృష్ణా వైపు వెళ్లే రాయిచుర్ ఎక్సప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో రైల్వే కోచ్‌లలో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రైలు టాయిలెట్లు అత్యంత దారుణంగా ఉండటంతో పాటు, కనీస పరిశుభ్రత కూడా పాటించకపోవడం రైల్వే శాఖ నిర్వహణ తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

టాయిలెట్లలో పేరుకుపోయిన మురికి, దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం చూస్తుంటే ప్రయాణికుల ఆరోగ్యం పట్ల రైల్వే అధికారులకు ఎంతమాత్రం బాధ్యత ఉందో అర్థమవుతోంది. ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు విఫలమవుతోంది?

రైల్వే ప్రయాణం సామాన్య ప్రజలకు ఎంతో ముఖ్యమైన రవాణా సౌకర్యం. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణించే రైళ్లలో కనీసం శుభ్రమైన టాయిలెట్లు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరం. ప్రయాణికుల సౌకర్యాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పే అధికారులు క్షేత్రస్థాయిలో కోచ్‌ల పరిస్థితులను ఎందుకు పరిశీలించడం లేదు?

రైల్వే ఉన్నతాధికారులకు మా డిమాండ్లు :

. కాచిగూడ–కృష్ణా మార్గంలో నడిచే రైళ్లలో తక్షణమే పారిశుధ్య తనిఖీలు నిర్వహించాలి.

. ప్రతి కోచ్‌లో టాయిలెట్లను నిరంతరం శుభ్రం చేసే విధంగా ప్రత్యేక సిబ్బందిని నియమించాలి.
. ప్రయాణికులకు పరిశుభ్రమైన నీరు, మరుగుదొడ్లు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి.
. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం రైల్వే శాఖ బాధ్యత. ప్రయాణికుల టికెట్ డబ్బులు తీసుకోవడమే కాదు, వారికి కనీస గౌరవం, పరిశుభ్రత, సౌకర్యాలు కల్పించాలి.*రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రయాణికుల తరఫున ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి మరింత బలంగా తీసుకెళ్తామని కోరుతున్నాము.