*జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో శ్రీనిధి విద్యార్థినికి సిల్వర్ మెడల్*
మధిర,సూర్య మేజర్ న్యూస్.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో మధిర మండల జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ జట్టులో శ్రీనిధి పాఠశాలకు చెందిన విద్యార్థిని టి. రితిజ్ఞ ప్రాతినిధ్యం వహించి అద్భుత ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించడం విశేషం . ఈ సందర్భంగా పాఠశాల ఆవరణం లో విద్యార్థినికి లభించిన సిల్వర్ మెడల్‌ను పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. చందు చేతుల మీదుగా అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ బి. అంజన్ బాబు,ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసరావు, పీడీ ప్రవీణ్ కుమార్, పీఈటీ శివ, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.