BREAKING
తీపర్రు ఎంపీటీసీ కరటూరి సుబ్బారావుకు బూరుగుపల్లి శేషారావు అభినందనలు దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమం మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి...

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు

Select Suryaa Now
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు

బషీరాబాద్, మేజర్ న్యూస్: జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు అన్నారు. జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో యూనియన్ నాయకులమంతా త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహాలు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు వెల్లడించారు. ఈ సమస్యలను శాసనసభ స్పీకర్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దృష్టికి తీసుకెళ్లి, వారి సహకారంతో ప్రభుత్వం వద్ద ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నర్సింహులును బుధవారం బషీరాబాద్ మండల జర్నలిస్టులు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ నాయకులతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మండల అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి సైమాన్, సీనియర్ జర్నలిస్టులు రామ్‌రెడ్డి, చెన్నారెడ్డి, శాంత్ కుమార్, రమేష్, కాశీంపాషా, హరిదాస్, శ్రీధర్, గోపాల్, మధు తదితరులు పాల్గొన్నారు.