BREAKING
గీతా మందిరం వద్ద అఖండ అన్నసమారాధన వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ ఎన్నికలంటేనే గొడ్డలి పార్టీకి గుబులు.. ఏకగ్రీవంగా తీర్మానించిన వీర మహిళలు - మేయర్ అభ్యర్థి జయశ్రీకి మహిళా లోకం జై భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ శోభాయాత్ర మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి "ఉప్పాడ" వ్యూహం! * రాజకీయ చతురతకు నిదర్శనం * ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీ ఆస్తి నష్టం తొలి రోజు ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు మండలంలో భక్తిశ్రద్ధలతో దసరా వేడుకలు రేణుక ఎల్లమ్మను దర్శించుకుంటే సర్వశుభాలు పాల్వంచ మమత విజయ్ గౌడ్ దంపతులు రాజరాజేశ్వరిగా కామాక్షిదేవికి పూజలు ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి నెల్లూరు ప్రగతి ప్రస్థానం ఆగకూడదు.. షరణి పొంగూరు రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు శంకుస్థాపన, స్టేడియం, బస్తి దవాఖాన, మేడికొండ బ్రిడ్జి ప్రారంభోత్సవం

Select Suryaa Now
ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు శంకుస్థాపన, స్టేడియం, బస్తి దవాఖాన, మేడికొండ బ్రిడ్జి ప్రారంభోత్సవం

సూర్య,ఇల్లందు  దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లందు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. తొలుత స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన తర్వాత జెకె కాలనీ సి ఈ ఆర్ క్లబ్ ప్రక్కన  నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న మినీ  స్టేడియం ప్రారంభోత్సవం,అదేవిధంగా ఫారెస్ట్ గ్రౌండ్ పక్కన గల బస్తీ దవాఖాన, రామ్పేడు గ్రామ పంచాయతీలోని మేడికుంట గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన ఓవర్ బ్రిడ్జ్ లను ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్ లో ఏర్పాటైన దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, వైస్ చైర్మన్ పెండేల రాజు, ఏఎంసి చైర్మన్ భానోత్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సందీప్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికార, అనధికారులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు