హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ సేవల విస్తరణ
మాదాపూర్,మేజర్ న్యూస్ : తెలంగాణలో బీఎండబ్ల్యూ కార్ల వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు కృష్ణ ఆటోమోటివ్ హైదరాబాద్‌లో కొత్త సర్వీస్ వర్క్‌షాప్, బీఎండబ్ల్యూ ప్రీమియం సెలక్షన్ (సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్ల విక్రయ కేంద్రం) ప్రారంభించింది. దీంతో కొత్త కార్ల విక్రయాలు, పాత కార్ల కొనుగోలు, విక్రయాలతో పాటు సర్వీసింగ్ సేవలు ఒకేచోట అందుబాటులోకి వచ్చాయి.బాలానగర్‌లోని ఐడీఏ రోడ్డులో 19,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 15 సర్వీస్ బేలు ఉన్నాయి. గచ్చిబౌలిలోని మహావీర్ గేట్‌వే వద్ద ఉన్న రిటైల్ నెక్స్ట్ షోరూమ్‌లో ఆరు బీఎండబ్ల్యూ కార్లను ప్రదర్శిస్తున్నారు.బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో విలాసవంతమైన కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, వినియోగదారులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. కృష్ణ ఆటోమోటివ్ డీలర్ ప్రిన్సిపల్ సచిత్ పస్సీ మాట్లాడుతూ.. అత్యాధునిక వసతులతో, శిక్షణ పొందిన సిబ్బందితో బీఎండబ్ల్యూ వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తామని పేర్కొన్నారు.