BREAKING
కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! హైదరాబాద్‌లోని రూ.12 కోట్ల ఇంటిని అమ్మేసిన అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా? ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అనుమతి లేని "కోకా"ను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం బడి మెట్టు ఎక్కిన మెగా ప్రిన్సెస్.. క్లీంకార క్యూట్ వీడియో వైరల్ కన్నుల పండుగ గా కార్తీక  పౌర్ణమి జాతర - వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

Select Suryaa Now
 గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

430 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, స్కూటీ స్వాధీనం

మొయినాబాద్ : మండలం అజీజ్‌నగర్ గ్రామంలోని శ్మశానవాటిక వద్ద గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు మొయినాబాద్ పోలీసులు ఈ రోజు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, అజీజ్‌నగర్ గ్రామ శ్మశానవాటిక వద్ద గంజాయిని విక్రయించేందుకు ఒక వ్యక్తి వస్తున్నట్లు తెలియడంతో, సంబంధిత ఉన్నతాధికారులకు సమాచారం అందించి, పంచ సాక్షులు మరియు క్లూస్ టీమ్ సహకారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం సుమారు 12:10 గంటలకు అక్కడ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని గుర్తించి, అతను పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి  సుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి అంతంగారి అరుణ్ కుమార్
విచారణలో, నిందితుడు బీదర్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తన స్నేహితులకు మరియు ఇతరులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపినట్లు పోలీసుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిందితుడి వద్ద నుంచి 430 గ్రాముల ఎండు గంజాయి, గంజాయి వినియోగానికి ఉపయోగించే ప్యాకెట్లు, ఒక ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, రెండు మొబైల్ ఫోన్లు మరియు TS12EB8065 రిజిస్ట్రేషన్ నంబరు గల స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను పంచ సాక్షుల సమక్షంలో ప్యాక్ చేసి, గుర్తింపు గుర్తులు వేసి సీజ్ చేసినట్లు తెలిపారు.
పై విషయం లో పోలీసు వారు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మొయినాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14):