ఘనంగా ఐఐటీ చుక్కా రామయ్య 101వ జన్మదిన వేడుకలు
పటాన్‌చెరు: ప్రముఖ విద్యావేత్త, ఇష్టా విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐఐటీ చుక్కా రామయ్య 101వ జన్మదిన వేడుకలను ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పటేల్‌గూడ, బీరంగూడ, పటాన్‌చెరు బ్రాంచీలలో సంస్థ సిబ్బంది, విద్యార్థులు కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీరంగూడ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపల్ పవన్ కుమార్ మాట్లాడుతూ, చుక్కా రామయ్య విద్యా రంగానికి చేసిన సేవలు, ఆయన విద్యా దృక్పథం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులకు ఒత్తిడి లేని, నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.పటేల్‌గూడ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపల్ విజయభాస్కర్ రెడ్డి, బీరంగూడ బ్రాంచ్ పోస్ట్ ప్రిన్సిపల్ పి. పవన్ కుమార్, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
విద్యానగర్‌లోని నివాసంలో ప్రత్యేక వేడుక…
ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట, అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్, పటేల్‌గూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ జె. రజిత, బీరంగూడ బ్రాంచ్ ప్రిన్సిపల్ జె. తులసి, విద్యాసంస్థల ఫిజికల్ డైరెక్టర్ డి. రమేష్ తదితరులు ఈ రోజు ఉదయం విద్యానగర్‌లోని ఐఐటీ చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయనకు 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలు, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన విద్యా ప్రస్థానం చిరస్మరణీయమని కొనియాడారు.చుక్కా రామయ్య జన్మదిన వేడుకలు విద్యార్థులు, అధ్యాపకుల్లో ఉత్సాహాన్ని నింపగా, విద్యా రంగానికి ఆయన చేసిన సేవలను మరోసారి గుర్తుచేసుకున్న సందర్భంగా నిలిచాయి.