BREAKING
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా : కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెబ్బటం గ్రామంలో అలీమ్ బాషా కుటుంబానికి జనసేన పార్టీ అండ ఆహార సంక్షోభ ముప్పు ఉన్నా సాయం లక్ష్యం కుదింపు టీడీపీ నుంచి బీ-ఫామ్ కోరింది వాస్తవమే.. రాకపోవడంతోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేశా వైస్ ఎంపీపీ మారపు విజయ ప్రతాప్ రెడ్డి స్పష్టీకరణ 22న గంగవరంలో బిపి, షుగరు, రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఘనంగా ఐఐటీ చుక్కా రామయ్య 101వ జన్మదిన వేడుకలు ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఘటన.. వచ్చే ఏడాది ఇద్దరు నిందితుల విచారణకు కోర్టు తేదీ ఖరారు అమెరికా షట్‌డౌన్ ముప్పు.. ఇరాన్ యుద్ధంపై చట్టసభ సభ్యులలో తీవ్ర విభేదాలు శివ మాల ధరించిన యాంకర్ స్రవంతి చొక్కారపు.. ఆధ్యాత్మిక ఫొటోలు వైరల్ ఆసియా వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ ప్రచారం ఐఎండీబీలో 9.5 రేటింగ్ సాధించిన తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ అన్బిల్ అవన్.. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 'వన్ హెల్త్' దిశగా సమన్వయం అవసరం ఏఐ షేర్ల అమ్మకాల సెగ 35 ఏళ్ల క్రితం మిస్సైన విమానం.. ఊహించని ట్విస్టులతో జేఎల్ 50 వెబ్ సిరీస్ సందడి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డు అధికారి!... రవీందర్ రెడ్డి

Select Suryaa Now
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డు అధికారి!... రవీందర్ రెడ్డి

మేడ్చల్,(మేజర్ న్యూస్):  ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించాల్సిన మున్సిపల్ కార్యాలయంలోనే లంచం వ్యవహారం వెలుగుచూడటం కలకలం రేపింది. ఫ్లాట్ అసెస్మెంట్ కోసం రిటైర్డ్ ప్రభుత్వ అధికారిని రూ.30 వేలు డిమాండ్ చేసి, ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఎల్లంపేట మున్సిపల్ వార్డు అధికారి రవీందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.    వివరాల్లోకి వెళ్తే.. రావాల్కోల్ వార్డు పరిధిలోని ఓ ఫ్లాట్ అసెస్మెంట్ విషయంలో వార్డు అధికారి లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో దాడి నిర్వహించారు. ఈ క్రమంలో రూ.30 వేల లంచం స్వీకరిస్తుండగా అధికారిని పట్టుకున్నట్లు తెలిసింది.     ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన కార్యాలయాల్లోనే లంచాల వ్యవహారాలు వెలుగుచూడటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఎల్లంపేట మున్సిపాలిటీపై అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోని ఇతర విభాగాల పనితీరుపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి, పారదర్శక పాలనకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.