తాండూరులో డాక్టర్ సంపత్ కుమార్‌తో కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ భేటీ
తాండూరు, మేజర్ న్యూస్: కర్ణాటక రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ తాండూరులో డాక్టర్ సంపత్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కరణ్‌కోట్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన మంత్రి, అనంతరం తాండూరులోని డాక్టర్ సంపత్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన తేనీటి విందులో మంత్రి పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, ఇతర కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంత్రి తాండూరులో డాక్టర్ సంపత్ కుమార్‌తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.