హెబ్బటం గ్రామంలో అలీమ్ బాషా కుటుంబానికి జనసేన పార్టీ అండ
హెబ్బటం గ్రామంలో అలీమ్ బాషా కుటుంబానికి జనసేన పార్టీ అండ
హొళగుంద సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో అలీమ్ బాష కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచిందని తాలూకా ఇన్చార్జి తెర్నేకల్ వెంకప్ప అన్నారు.
జనసేన పార్టీ క్రియాశీలక బీమా పథకం ద్వారా మంజూరైన రూ.5,00,000 (ఐదు లక్షల రూపాయల) ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు.
హెబ్బటం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు దివంగత అలీమ్ బాషా గారి కుటుంబాన్ని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తెర్నేకల్ వెంకప్ప పరామర్శించారు.
అలీమ్ బాషా గత సంవత్సరం ప్రమాదవశాత్తుగా మరణించారు.
ఈ సందర్భంగా తెర్నేకల్ వెంకప్ప మాట్లాడుతూ జనసేన పార్టీ తన కార్యకర్తలు,నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారి కుటుంబాలకు తోడుగా నిలబడటం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున కురువ కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ ఆస్పరి మండల కన్వీనర్ అరవింద్ హోళగుంద మండల కన్వీనర్ అశోక్, గారు,జనసేన నాయకులు మల్లయ్య,వీరేష్,ఆది, మల్లికార్జున,హారూన్ బాషా, సుభాన్,రఫీక్, శ్రీనివాసులు, రవి, మహేష్, పెన్నేష్
టీడీపీ తరఫున హోళగుంద ఎంపీపీ బోయ జయలక్ష్మి బీజేపీ తరఫున కాలప్ప పాల్గొన్నారు.
*కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం – జనసేన బాధ్యత*
#JanaSena #PawanKalyan
#TernekalVenkappa #Alur