జనసేన పార్టీ ప్రచారం
శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీలో 38వ వార్డు పరిధిలో కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయప్రకాషతో బీజేపీ అనంతపురం జిల్లా ఇన్చార్జి డాక్టర్ చంద్రప్ప , తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతాప్ , మునికృష్ణ ఆచారి (ప్రేమ్ కృష్ణ), జనసేన నాయకులు సత్ర వాడ ప్రవీణ్ , కార్యకర్తలతో కలసి గడపగడపకు వెళ్లి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి జయప్రకాష్ గారిని ప్రజలకు పరిచయం చేస్తూ, కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజల మద్దతు తెలియజేయాలని, వార్డు అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరడం జరిగింది.
కూటమి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో ప్రజల్లోకి వెళ్తూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలియజేశారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి