కూటమి సర్పంచ్అ భ్యర్థి గంగాధర్ ఎమ్మెల్యే అమిలినేనితో భేటీ.
కుందుర్పి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉన్నత విద్యావంతుడు, సాఫ్ట్‌వేర్ నిపుణుడు సజ్జల కేసప్ప గారి గంగాధర్ (ఎంసీఏ) కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, కుందుర్పి గ్రామ అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. విద్యావంతుడిగా, సాఫ్ట్‌వేర్ రంగంలో నిపుణుడిగా గుర్తింపు పొందిన గంగాధర్ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి ఎమ్మెల్యేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గంగాధర్‌కు తన ఆశీస్సులు అందించారు. కుందుర్పి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు. గ్రామస్తుల సహకారం, నాయకుల మార్గదర్శకత్వంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు గంగాధర్‌తో కలిసి ఎమ్మెల్యేను కలవడం కుందుర్పి గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీతో గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, గంగాధర్ అనుచరులు పాల్గొన్నారు.