టీడీపీ నుంచి బీ-ఫామ్ కోరింది వాస్తవమే.. రాకపోవడంతోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేశా వైస్ ఎంపీపీ మారపు విజయ ప్రతాప్ రెడ్డి స్పష్టీకరణ
పాములపాడు, మేజర్ న్యూస్: పాములపాడు మండల పరిధిలోని వాడాల గ్రామానికి చెందిన మారపు విజయ ప్రతాప్ రెడ్డి శుక్రవారం పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు. తాను టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీ-ఫామ్ కోరిన మాట వాస్తవమేనని, ఎంపీ బైరెడ్డి శబరి ద్వారా బీ-ఫామ్ పొందేందుకు ప్రయత్నించినప్పటికీ అది అందకపోవడంతో కార్యకర్తల అభిప్రాయం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించానని తెలిపారు.
గతంలో తాను వైఎస్సార్‌సీపీలో ఉన్నానని, టీడీపీలో తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు వివరించారు. గురువారం జరిగిన ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తనకు గౌరవం ఇచ్చి వైస్ ఎంపీపీ పదవి కల్పించారని పేర్కొన్నారు.
అలాగే ఎంపీ బైరెడ్డి శబరికి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఈ ఇద్దరిని ముడిపెడుతూ బయట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మారపు విజయ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.