BREAKING
శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా మందలపు పూర్ణచంద్రరావు. జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి : హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ మెక్సికో-యూరోప్‌లను మరింత దగ్గర చేస్తున్న పరిణామాలు చిత్తూరు రూరల్‌లో అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్ర నాయుడు సమన్వయంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక - బండి సంజయ్, రామచంద్రరావు, సునీల్ బన్సల్ తదితర ప్రముఖుల హాజరు ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ భావోద్వేగ రాజకీయాలకు బలికావద్దు.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: డా. శివ ప్రసాద్

విజయనగరం జిల్లా జడ్పీ పీఠం కూటమి కైవసం.. చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
విజయనగరం జిల్లా జడ్పీ పీఠం కూటమి కైవసం.. చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర ఏకగ్రీవ ఎన్నిక

విజయనగరం, నవంబర్ 20, మేజర్ న్యూస్:

విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) కూటమి పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) హర్షం వ్యక్తం చేశారు. బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం నుంచి జడ్పీటీసీగా విజయం సాధించిన తన కుమార్తెకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యత లభించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారి నాయకత్వం, మార్గదర్శకత్వం, ఆశీస్సులతో తన కుమార్తెకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

అదేవిధంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కి, బుడా చైర్మన్ టెంటు లక్ష్మణ నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిరి సహస్ర రాజకీయ ప్రస్థానంలో వారు అందించిన సహకారం, ప్రోత్సాహం అభినందనీయమని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తమ కుటుంబంపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ మరియు వైస్ జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. జడ్పీ సీఈఓ పి. కిరణ్ కుమార్ అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పర్యవేక్షణలో ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించగా, మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా, పసల నీరజ వైస్ జడ్పీ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి  కళా వెంకటరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ శ్రీనివాసుల నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని తదితర ప్రముఖులు పాల్గొని నూతన జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్రతో పాటు నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మజ్జి సిరి సహస్ర (సిరమ్మ) జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చాంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో ప్రజాసేవ, జిల్లా అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం, కూటమి నాయకులు, ప్రజలు తన కుమార్తెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విజయనగరం జిల్లా అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గొప్ప అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, సహకరించిన నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీనివాస్ బ్యూరో విజయనగరం