telangana
కొమురం భీం వారసుల కుటుంబానికి జాధవ్ శ్రీకాంత్ పరామర్శ
సూర్య జైనూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం పెద్ద దొబ్బ గ్రామానికి చెందిన కొమురం భీం రెండవ వారసుడు కుమ్ర భీంరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హెడ్ సొసైటీ అధ్యక్షుడు జాధవ్ శ్రీకాంత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన స్వగ్రామానికి వెళ్లి భీంరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మృతి చెందడం తీరని లోటని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొమురం భీం మనవడు సోనే రావు, కుమ్రం జంగు, ఆత్రం రాము తదితరులు పాల్గొన్నారు.