22న గంగవరంలో బిపి, షుగరు, రెగ్యులర్ మెడికల్ క్యాంపు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
గంగవరం ఆరోగ్య & సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో గత 13 సంవత్సరముల నుండి రెండు నెలలకు ఒకసారి జరుగుతున్న బీపీ,షుగరు, రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఈనెల నవంబర్ 22వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుందని క్యాంపు కన్వీనర్ కరి బాలచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు. పేషెంట్లు రక్తంలో షుగర్ పరీక్ష తినక ముందు, ఒకసారి తిన్న తర్వాత గంటన్నరకు, ఒకసారి పరీక్ష చేయించుకుని రావాలని కోరారు. క్యాంపుకు వచ్చేటప్పుడు మీ పాత పుస్తకాలు తీసుకొని రావాలన్నారు. కొత్తగా చూపించుకునేవారు మీ పాత రిపోర్టులు, మందులు ఏమి వాడుతున్నారో అవి తీసుకొని రావాలన్నారు. శిబిరంలో డాక్టర్ మంచాల రమేష్ కుమార్, డాక్టర్ బి.హరిబాబు, డాక్టర్ ఏ. సాంబయ్య వైద్య సేవలు అందిస్తారన్నారు.
గంగవరం గ్రామ, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలచంద్రం కోరారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్ 9440739073 కు సంప్రదించాలన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.