BREAKING
శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా మందలపు పూర్ణచంద్రరావు. జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి : హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ మెక్సికో-యూరోప్‌లను మరింత దగ్గర చేస్తున్న పరిణామాలు చిత్తూరు రూరల్‌లో అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్ర నాయుడు సమన్వయంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక - బండి సంజయ్, రామచంద్రరావు, సునీల్ బన్సల్ తదితర ప్రముఖుల హాజరు ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ భావోద్వేగ రాజకీయాలకు బలికావద్దు.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: డా. శివ ప్రసాద్

వర్గల్ నవోదయ విద్యాలయంలో బాలికలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్ల పంపిణీ

Select Suryaa Now
వర్గల్ నవోదయ విద్యాలయంలో బాలికలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్ల పంపిణీ

వర్గల్: బాలికల ఆరోగ్యం, రుతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు, రుతుస్రావ సమయంలో అవసరమైన పరిశుభ్రత ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్‌లో ఉచిత సానిటరీ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.విద్యాలయంలోని 230 మంది బాలికలకు జీవవిచ్ఛిన్నమయ్యే (బయోడిగ్రేడబుల్) సానిటరీ ప్యాడ్ల ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు విద్యాలయ ప్రధానాచార్యులు దాసి రాజేందర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యాలయ ఎంపీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వాల్మీకి ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ హరికిషన్, సంస్థ వాలంటీర్ మౌనిక పాల్గొని పంపిణీ చేపట్టారు.కార్యక్రమానికి ముందు ఫౌండేషన్ ప్రతినిధులు తమ సంస్థ లక్ష్యాలు, సేవా కార్యక్రమాల ఉద్దేశాలను విద్యార్థినులకు వివరించారు. రుతుస్రావ పేదరికాన్ని నిర్మూలించడం, బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మొత్తం 230 ప్యాకెట్లను పంపిణీ చేయగా, ఒక్కో ప్యాకెట్‌లో 10 సానిటరీ ప్యాడ్లు ఉన్నాయి. ఈ పంపిణీకి సంబంధించిన మొత్తం విలువ రూ.34,500.

బాలికల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం…

ఈ సందర్భంగా వాల్మీకి ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ, ప్రత్యూష, రోటరీ క్లబ్ ఆఫ్ అభ్యుదయ హైదరాబాద్ సంస్థల సహకారంతో జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్‌లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా బాలికలకు అవసరమైన పరిశుభ్రత ఉత్పత్తులను అందించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యాలయ ప్రధానాచార్యులు దాసి రాజేందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ శరత్, విద్యాలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వాలంటీర్ మౌనిక మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన, ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన బాలికలకు రుతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చి, ఆరోగ్యకరమైన పరిశుభ్రత అలవాట్లపై అవగాహన కల్పించారు.

ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు…

విద్యాలయంలో ఇలాంటి ఆరోగ్య అవగాహన, సేవా కార్యక్రమాలు నిర్వహించడం విద్యార్థినులకు ఎంతో ఉపయోగకరమని ప్రధానాచార్యులు దాసి రాజేందర్ పేర్కొన్నారు. బాలికల ఆరోగ్యం, సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వాల్మీకి ఫౌండేషన్‌కు విద్యాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం బాలికల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు, అవసరమైన పరిశుభ్రత ఉత్పత్తులను అందించడం ద్వారా సామాజిక సేవకు మంచి ఉదాహరణగా నిలిచింది.