BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పెద్ద కొడపుగల్ విద్యార్థులు ఎంపిక - ముగ్గురికి రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం

Select Suryaa Now
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పెద్ద కొడపుగల్ విద్యార్థులు ఎంపిక - ముగ్గురికి రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం

 

సూర్య పెద్ద కొడపుగల్ : పెద్ద కొడపుగల్ మండలంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కబడ్డీ క్రీడలో తమ ప్రతిభను చాటుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.కామారెడ్డి జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోశుక్రవారం నిర్వహించిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌-14 బాలబాలికల కబడ్డీ పోటీల్లో పెద్ద కొడపుగల్ పాఠశాలకు చెందిన బి. కృష్ణ, బి. ప్రశాంత్, బి. ప్రియాంకలు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి ఉన్నతస్థాయి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్. సత్యం ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ అందిస్తున్నారు. ఆయన కృషిని పలువురు అభినందించారు.  ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. కమల తెలిపారు.రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ నాగరాజు, ఉపాధ్యాయ బృందం గ్రామ పెద్దలు, యువకులు అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.