BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

యూనివర్సిటీ విధ్వంసానికి మద్దతిస్తారా.. విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తారా? - మేడిపల్లి సత్యంపై చుక్క శ్రీనివాస్ ప్రశ్నలు

Select Suryaa Now
యూనివర్సిటీ విధ్వంసానికి మద్దతిస్తారా.. విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తారా? - మేడిపల్లి సత్యంపై చుక్క శ్రీనివాస్ ప్రశ్నలు
సూర్య కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీలో చెట్ల నరికివేత, మట్టి తరలింపుతో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ ప్రశ్నించారు. యూనివర్సిటీలో మిగిలిన సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి జేఏసీ నాయకులకు మేడిపల్లి సత్యం సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఆయన ఈ ప్రశ్నలు సంధించారు. యూనివర్సిటీలో పెద్ద చెట్ల నరికివేత, లోతైన గుంతలు తవ్వి మట్టి తరలింపుతో ఆహ్లాదకర వాతావరణం దెబ్బతింటోందని, ఈ విధ్వంసంపై ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న బాయ్స్ హాస్టల్ వద్ద ఎలుగుబంటి, 19న కొండచిలువ సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. చెట్ల నరికివేతతో వన్యప్రాణులు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఒక కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ యూనివర్సిటీ సమస్యలపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. యూనివర్సిటీని సందర్శించి విధ్వంసానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చుక్క శ్రీనివాస్, యూనివర్సిటీ అధ్యక్షుడు కుక్కమల్ల నరేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కళాశాల బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గాజుల సాయి చరణ్, ఉపాధ్యక్షురాలు పర్రెం రశ్మిత రెడ్డి, కార్యదర్శులు పల్లి నందు, పాదం రాహుల్ పాల్గొన్నారు.