telangana
పైల్స్ ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులతోనే చికిత్స - మెడికవర్‌లో వారం పాటు పైల్స్‌కు ఉచిత కన్సల్టేషన్
సూర్య కరీంనగర్ : పైల్స్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే చాలా సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం లేకుండానే నియంత్రించవచ్చని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అవసరాన్ని బట్టి అత్యాధునిక లేజర్ చికిత్సా విధానాలు, శస్త్రచికిత్స మెడికవర్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. లేజర్ చికిత్స చేసుకుంటే రెండో రోజే డిశ్చార్జ్ అయి యధావిధిగా పనులు చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం వరల్డ్ పైల్స్ డే సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, అనెస్థీషియా హెడ్ డాక్టర్ వినయ్ మాట్లాడారు. పైల్స్‌డేను సందర్బంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉచిత కన్సల్టేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మలద్వారం వద్ద ఎలాంటి సమస్య ఉన్నా మొహమాటం లేకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా టాయిలెట్‌లో సెల్‌ఫోన్ వాడకం మానేయాలని తెలిపారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు. మల విసర్జనలో రక్తస్రావం, నొప్పి, మంట, దురద, వాపు, గడ్డలు ఏర్పడటం పైల్స్ లక్షణాలని తెలిపారు. సమస్య కనిపిస్తే మసాలా తిన్నానని, అల్కాహాల్ తాగడం వల్ల వచ్చిందని భ్రమ పడకుండా... స్వయంగా వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. పైల్స్ రావడానికి ముఖ్యంగా మలబద్ధకం, ఆహారంలో పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ తగ్గడం ప్రధాన కారణాలని వివరించారు. రోగి పరిస్థితి, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స అందిస్తామని, ప్రారంభ దశలో మందులు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతో సమస్యను నియంత్రించవచ్చని తెలిపారు. ఆహారపు అలవాట్ల మార్పు, తగినంత నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల పైల్స్ సమస్యకు దూరంగా ఉండవచ్చన్నారు. మెడికవర్ సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, మెడికల్ హెడ్ డాక్టర్ ప్రియాంక, ఆర్ ఎంవో డాక్టర్ నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.