BREAKING
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా : కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెబ్బటం గ్రామంలో అలీమ్ బాషా కుటుంబానికి జనసేన పార్టీ అండ ఆహార సంక్షోభ ముప్పు ఉన్నా సాయం లక్ష్యం కుదింపు టీడీపీ నుంచి బీ-ఫామ్ కోరింది వాస్తవమే.. రాకపోవడంతోనే ఇండిపెండెంట్‌గా పోటీ చేశా వైస్ ఎంపీపీ మారపు విజయ ప్రతాప్ రెడ్డి స్పష్టీకరణ 22న గంగవరంలో బిపి, షుగరు, రెగ్యులర్ మెడికల్ క్యాంపు ఘనంగా ఐఐటీ చుక్కా రామయ్య 101వ జన్మదిన వేడుకలు ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ ఘటన.. వచ్చే ఏడాది ఇద్దరు నిందితుల విచారణకు కోర్టు తేదీ ఖరారు అమెరికా షట్‌డౌన్ ముప్పు.. ఇరాన్ యుద్ధంపై చట్టసభ సభ్యులలో తీవ్ర విభేదాలు శివ మాల ధరించిన యాంకర్ స్రవంతి చొక్కారపు.. ఆధ్యాత్మిక ఫొటోలు వైరల్ ఆసియా వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ ప్రచారం ఐఎండీబీలో 9.5 రేటింగ్ సాధించిన తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ అన్బిల్ అవన్.. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 'వన్ హెల్త్' దిశగా సమన్వయం అవసరం ఏఐ షేర్ల అమ్మకాల సెగ 35 ఏళ్ల క్రితం మిస్సైన విమానం.. ఊహించని ట్విస్టులతో జేఎల్ 50 వెబ్ సిరీస్ సందడి

రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డు అధికారి

Select Suryaa Now
రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డు అధికారి

మేడ్చల్, మేజర్ న్యూస్:ఎల్లంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వార్డు అధికారి రవీందర్ రెడ్డిని రూ.30 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు సమాచారం. రావాల్కోల్ వార్డు పరిధిలోని ఓ ఫ్లాట్ అసెస్మెంట్‌కు సంబంధించి రిటైర్డ్ ప్రభుత్వ అధికారిని సదరు అధికారి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా ప్రణాళికతో మున్సిపల్ కార్యాలయంలోనే వలపన్ని లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నట్లు తెలిసింది.ప్రజలకు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం ప్రభుత్వ సేవలు అందించాల్సిన అధికారులపై లంచం ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఎల్లంపేట మున్సిపాలిటీలో అవినీతి, అక్రమ వసూళ్లకు సంబంధించి పలు విమర్శలు వ్యక్తమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మున్సిపాలిటీలోని ఇతర విభాగాల పనితీరుపైనా సమగ్ర విచారణ చేపట్టి, అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.