BREAKING
బంగారం, వెండి ధరలు డౌన్.. సోమవారం తులం ఎంతంటే? ఇఫీ 2026లో 'రామాయణ' ప్రదర్శన.. దేశానికి గౌరవం: నితీష్ తివారీ 'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్.. నవంబర్ 27న రిలీజ్ 'వృషకర్మ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. నవంబర్ 25న గ్రాండ్ ఈవెంట్ 15 దేశాల్లో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసిన తొలి ఇండియన్ సినిమా 'బాల 369': విజయ్ కుమార్ కలివరపు హై సినిమా చూశాను.. జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో అద్భుతంగా తీశారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మోక్షప్రదాయకం.. మహా పవిత్రం కార్తీక సోమవారం! 7వ వార్డు అభ్యర్థిగా ముంతాజ్ బేగం నామినేషన్ దాఖలు "పడాల" నామినేషన్ కు భారీ ఏర్పాట్లు ప్రజాస్వామ్య పరిరక్షణకే మా పయనం! ఘనంగా ఆర్యవైశ్య వన అన్న సమారాధన! ఆటపాటలతో సందడిగా సాగిన వేడుకలు.. పూర్వ సంఘ అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులకు ఘన సన్మానం ఎన్నికల వేళ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం

గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్) మండలంలోని గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తొలిరోజే బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం కావడంతో కాలనీవాసుల్లో ఆనందం వెల్లివిరిసింది.

జాన్సన్ డేవిడ్ (బాబు) 
సూర్య రిపోర్టర్ 
చుంచుపల్లి మండలం 
కొత్తగూడెం.