ఎస్సీ ఎస్టీ కులస్తులకు తమ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి
సూర్య- బిక్కనూర్ ;;ఎస్సీ ఎస్టీ కులస్తులకు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ నజీముద్దీన్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో షెడ్యూలు కులాల అభివృద్ధిపై కుల సంఘ సభ్యులకు ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎస్సీ ఎస్టీ షెడ్యూలు కులాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిపిఓ కాశీరాం పోలీస్ కానిస్టేబుల్ రామాంజనేయులు, వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ వార్డు సభ్యులు కర్రోలరాజు,సురేష్ గౌడ్ ప్రజలు పాల్గొన్నారు