telangana
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
సూర్య రాజంపేట : రాజంపేట మండలంలోని అరగొండ, రాజంపేట గ్రామాల్లో మంగళవారం 100 శాతం ఎరువుల తనిఖీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులుr సుధామాధురి, తాడ్వాయి మండల వ్యవసాయ అధికారి కె. నర్సింలు, రాజంపేట మండల వ్యవసాయ అధికారి జి. జోష్ణ ప్రియదర్శిని సంయుక్తంగా ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కిసాన్ అగ్రిమార్ట్‌లో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, ధరల వివరాలను పరిశీలించారు. ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలను అరికట్టాలని వ్యాపారులకు సూచించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు.