telangana
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు ఘన స్వాగతం
సూర్య కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డాక్టర్ అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన జిల్లా యూనియన్ కార్యాలయానికి విచ్చేయగా, యూనియన్ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్, వైస్ చైర్మన్ చిగుర్ల శ్రీనివాస్ కురుమ, డైరెక్టర్లు కాల్వ సురేష్ యాదవ్, బండి మల్లయ్య యాదవ్‌లు డాక్టర్ అజయ్ కుమార్‌కు శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకులు నాగారపు సత్యనారాయణ యాదవ్, కార్యాలయ సిబ్బంది అహ్మద్ పాషా, ఎన్. ప్రశాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.