ఢిల్లీలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీడీసీ చైర్మన్ గడీల రామిరెడ్డి
సదాశివపేట;భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి సీడీసీ చైర్మన్ గడీల రామిరెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలను, దేశ అభివృద్ధి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.