BREAKING
బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి గుండెపోటుతో యువకుడు మృతి -- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గడ్డ మణుగు రవికుమార్ మెదక్ జిల్లాలో మనోహరాబాద్ ఒక్కటే కరువు పీడిత మండలం గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు...

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి లాటరీ ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలి – ఆర్డీఓకు కౌన్సిలర్ల వినతి

Select Suryaa Now
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి  లాటరీ ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలి – ఆర్డీఓకు కౌన్సిలర్ల వినతి

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

లాటరీ ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలి – ఆర్డీఓకు కౌన్సిలర్ల వినతి

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు శనివారం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.. 2017లో అప్పటి ప్రభుత్వం మిర్యాలగూడ పట్టణంలో మొత్తం 565 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. వీటిలో 40 ఇళ్లను కేటాయించగా, మిగిలిన 525 ఇళ్లకు సంబంధించి 48వ వార్డులో గ్రామసభలు నిర్వహించి, ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వివరించారు.

అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇళ్ల పంపిణీ ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గతంలో లాటరీ ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారులను అనధికారికంగా జాబితా నుంచి తొలగించి, అధికార పార్టీకి చెందిన వారికి 245 ఇళ్లను కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, గతంలో లాటరీ ద్వారా ఎంపికైన 245 మంది అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా లాటరీ ద్వారా ఎంపికైన అర్హులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండీ ఇలియాస్ ఖాన్, కౌన్సిలర్లు పెద్ది శ్రీనివాస్ గౌడ్, గంగుల భిక్షం, వడ్డేపల్లి శ్రీనివాస్, గుడిసె దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.