చెస్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్-
శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో చెస్ ఉమెన్స్ విభాగంలో ఎంపిక నిర్వహించారు.ఈ ఎంపికలకు పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ మరియు రిజిస్టర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ ఉమెన్స్ విభాగంలో క్రీడల్లో పాల్గొనడం ద్వారా అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయని ఉదాహరణకు ఉమెన్స్ స్పోర్ట్స్ కూడా విభాగంలో మరియు పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే ఇతర ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు 09-11-2026 నుండి 12-11-2026 వరకు వాక్సిన్ ( woxsen ) యూనివర్సిటీ, హైదరాబాద్ తెలంగాణ లో నిర్వహించు సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారని పాలమూరు యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు వారం రోజులపాటు స్పెషల్ క్యాంపు ఉంటుందని కాబట్టి క్రీడాకారులు ఈ క్యాంపు ను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో స్కిల్స్ ను నేర్చుకోవాలన్నారు. అలాగే యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఉన్నటువంటి క్రీడా సదుపాయాలను వినియోగించుకుని యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.టేబుల్ టెన్నిస్ లో ఎంపికైన క్రీడాకారులు శరత్ కుమార్, బాలు, సాయి గణేష్ పాలమూరు యూనివర్సిటీ నుండి మరియు నిఖిల్ గౌడ్ నగేష్ డాక్టర్ బి.ఆర్ కాలేజ్ నుంచి ఎంపికై ఈరోజు ఉదయం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరుగు 31-10-26 నుండి 02-11-26 వరకు జరుగు సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనేందుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్ గారు ఎంపికైన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు ట్రాక్ షూట్, టీం యూనిఫామ్ మరియు స్పోర్ట్స్ షూ ను వారికి ప్రత్యేకంగా అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇన్ చంద్ర కిరణ్ మరియు యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వై శ్రీనివాసులు, మన్యం తదితరులు పాల్గొన్నారు.
ఎం. ఓం ప్రకాష్ , పాలమూరు యూనివర్సిటీ ,మహబూబ్ నగర్