BREAKING
మంత్రాలయంలో రాఘవ సరోవర ప్రాజెక్టుకు భూమిపూజ పెద్ద సిద్దపూర్ జీపీ లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని జీపీ భవనం..... ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు కులం పేరుతో దూషణలు, దాడులు, కుటుంబానికి ప్రాణహాని ఉందని కలెక్టర్ కు ఫిర్యాదు. గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షిష ఎన్నికల్లో అల్లర్లు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు తప్పవ్:డీఎస్పీ ....390 మంది సిబ్బందితో పటిష్ట చర్యలు..… ఇద్దరికీ డాక్టరేట్లు ప్రధానం సెంట్రల్‌లో 29 స్థానాలకు 28 చోట్ల కూటమి విజయం: బొండా ఉమామహేశ్వరరావు జ్యోతికి డాక్టరేట్ అర్హులైన పట్టభద్రులు వెంటనే ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ మండల కార్యదర్శి సంకు శంకర్ తెలుగుదేశం పార్టీలో చేరిన రామచంద్రప్పకు ఘన సన్మానం. నాగాయలంకలో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ వెలగలేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇళ్లపై ఈడీ దాడులు భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ అప్రమత్తం

భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి • కలెక్టర్ రాజర్షిషా

Select Suryaa Now
భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి  • కలెక్టర్ రాజర్షిషా

 

సూర్య, ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లాలోని నార్నూర్‌ మండలంలో కొనసాగుతున్న సమగ్ర భూముల రీ-సర్వే, ఎన్‌మెంట్‌ సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం నార్నూర్‌ మండలంలోని గంగాపూర్ (జి) గ్రామంలో రీసర్వే పక్రియను ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ తో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు దిశనిర్దేశం చేశారు 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూముల రీసర్వే పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గంగాపూర్, మాదాపూర్, ఖైర్దట్వా, సోనాపూర్ గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియను తలపెట్టగా, ప్రస్తుతం గంగాపూర్ పరిధిలో సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ రీ-సర్వేలో భాగంగా ఇప్పటివరకు 6 కిలోమీటర్ల మేర హద్దుల గుర్తింపు పూర్తయిందనీ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా కలెక్టర్ స్వయంగా గంగాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 2 భూములను, గ్రామ కంఠాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్ పరికరం పని విధానం, బౌండరీ హద్దులు ఎలా నిర్ధారించారు, డేటా ఫీడింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. ప్రభుత్వ భూములకు తొలి ప్రాధాన్యతనిచ్చి సర్వే పూర్తి చేసి, అన్ని వివరాలు డేటాను జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తహసిల్దార్ రాజలింగు, ఎంపిడిఓ పుల్లయ్య, సర్పంచ్ ఉష, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జయరాం, సర్వేయర్లు, ఇతర అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.