BREAKING
పారితోషకం జాప్యంపై సిబ్బంది పెదవి విరుపు సమాజం పట్ల బాధ్యతతో డ్రగ్స్ కి దూరంగా ఉంటూ తల్లిదండ్రుల కలను నెరవేర్చాలి నీటి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి..... చిరుత సంచారం పై అప్రమత్తంగా ఉండండి. అడవి శాఖ అధికారి మల్లికార్జున. బాసర ఐఐఐటీ విద్యార్థులకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నెల్లిమర్లలో వామపక్షాల నిరసన * ఎస్ఈసీ రాజీనామాకు డిమాండ్ * సూపర్ హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ మెకా.. గ్రాండ్‌గా కొత్త చిత్రం ప్రారంభం! రైతులు రైతు గుర్తింపు కార్డులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి విద్య ద్వారానే అభివృద్ధి * ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి రాజ్ * యాదవుల వీరత్వానికి ప్రతీక సదర్ సమ్మేళనం రామతీర్థం శ్రీరామస్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.21,89,335 ఉన్నత విద్యావంతుడు సర్పంచ్ అయితే గ్రామ రూపురేఖలు మారుతాయి! గ్రామాభివృద్ధి, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా వీరవల్లి శివరామకృష్ణ ఎం.టెక్‌, ఎఫ్‌.ఐ.ఈ., న్యాయశాస్త్రంలో పీజీ పట్టా.. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధన రూ.60 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ సెంటర్‌ను ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ కరువు పరిస్థితుల్లో రైతు కుటుంబాలను వేధించడం సరికాదు - మాజీ మంత్రి జోగు రామన్న. నూతన దుర్గాభవాని ఫర్టిలైజర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

బీజేపీ నేతల వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనంః మంత్రి శ్రీధర్ బాబు

Select Suryaa Now
 బీజేపీ నేతల వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనంః మంత్రి శ్రీధర్ బాబు

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు సాగుతున్న పార్టీ కాంగ్రెస్ అని, ఆ భావజాలమే తమ పార్టీకి మార్గదర్శకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో భారత్ సమ్మిట్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆలోచనా విధానాలు పూర్తిగా భిన్నమని, బీజేపీ భావజాలం ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. భారత్ సమ్మిట్‌ను రాహుల్ గాంధీని రీ లాంచ్ చేయడానికే నిర్వహిస్తున్నారంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని శ్రీధర్ బాబు విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడని, ఆయనను ప్రత్యేకంగా మళ్లీ లాంచ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తర్వాత ఎవరిని లాంచ్ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉందా అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఆలోచనా విధానం బీజేపీకి ఎప్పటికీ అర్థం కాదని వ్యాఖ్యానించారు. భారత్ సమ్మిట్ నిర్వహణ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సదస్సు తరహాలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమ్మిట్‌లో యువత, సాంకేతిక పరిజ్ఞానం సహా అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా జెన్‌జీ యువత లేవనెత్తుతున్న పలు సమస్యలు, అంశాలపై మేధోపరమైన చర్చలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే ఎస్‌ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అప్రజాస్వామిక చర్యలపైనా భారత్ సమ్మిట్‌లో చర్చించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.