BREAKING
ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం

బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి- జనసేవ సంస్థ నిర్వాహకులు ఎన్ మంజుల

Select Suryaa Now
బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి- జనసేవ సంస్థ నిర్వాహకులు ఎన్ మంజుల

(సూర్య దినపత్రిక స్పెషల్ కరస్పాండెంట్) హైదరాబాద్ :ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జనసేవ సంస్థ నిర్వాహకురాలు ఎన్ మంజుల డిమాండ్ చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడంతో పాటు, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నమయ్యే) ఉత్పత్తుల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ రంగంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించి, పర్యావరణహిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చడాన్ని కఠినంగా అరికట్టాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త దహనం వల్ల వెలువడే విషవాయువులతో వాయు కాలుష్యం పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

చెరువులు, కుంటలు, కాలువల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు స్థానిక సంస్థలు ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని దారా రవికుమార్ సూచించారు. ప్రతి గ్రామం, పట్టణంలో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. బయో డిగ్రేడబుల్ ఉత్పత్తుల నాణ్యత, పర్యావరణ ప్రమాణాలపై తగిన నియంత్రణతో పాటు వాటి తయారీదారులకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాల చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.