బడుగుల గొంతుకగా పనిచేస్తా -తెలంగాణ రక్షణ సేన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్
సూర్య - పెద్దపల్లి :
తెలంగాణ రక్షణ సేన జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉస్తేం శ్రీనివాస్ నియమితులయ్యారు.హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయం నుంచి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు వెనుకబడిన వర్గాల హక్కులు,సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా అధిష్ఠానం సూచించింది.జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉస్తేం శ్రీనివాస్ నియామకం పట్ల ప్రగతి మృత్యు కార్మిక సేవ సమితి
నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రగతి మృత్యు కార్మిక సేవ సమితి
నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉస్తేం శ్రీనివాస్ ను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా నిరంతరం ప్రజాసేవ, జాతి అభ్యున్నతే ధ్యేయంగా ఉస్తేం శ్రీనివాస్
పనిచేస్తున్నానని గుర్తుచేశారు.ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముదిరాజ్ జాతి బిడ్డల సమస్యల పరిష్కారం కోసం,మత్స్య కార్మిక సహకార సంఘాల హక్కుల కోసం నిరంతరం అండగా నిలబడడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఉస్తేం శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు,ఇందుకు సహకరించిన పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటికి,రాష్ట్ర నాయకత్వానికి ఉస్తేం శ్రీనివాస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.బడుగు, బలహీన వర్గాల గొంతుకై పనిచేస్తూ,సంస్థ సిద్ధాంతాలను ప్రతి పల్లెకూ తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.పెద్దమ్మ తల్లి ఆశయాల వారసులుగా ముదిరాజ్ జాతి అభివృద్ధి కోసం నాయకులంతా నిబద్ధతతో,విప్లవాత్మక ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రగతి మృత్యు కార్మిక సేవ సమితి ముదిరాజ్ క్రమశిక్షణ పార్టీ చైర్మన్ కారుపాకాల రమేష్,జిల్లా ఉపాధ్యక్షుడు కలవేన రవి,ముదిరాజ్ జిల్లా నాయకుడు కలవేన శీనివాస్, మీడియా ఇంచార్జి కలవేన రాము,ముత్తారం మండలం అధ్యక్షులు ఎర్రం లక్ష్మయ్య, ఈర్ల సదయ్య,సబ్బు తిరుపతి,కారుపాకాల రాజేందర్,జునువాలా శ్రీనివాస్,శంకరి తోపాటు ముదిరాజ్ సంఘ ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.