BREAKING
పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విద్యార్థుల చదువుకు దూరం అడ్డంకి కాకూడదు : మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ

బడుగు వర్గాల ఆశాజ్యోతి పూలే ఆర్మూర్‌లో వర్ధంతి వేడుకలు

Select Suryaa Now
బడుగు వర్గాల ఆశాజ్యోతి పూలే ఆర్మూర్‌లో వర్ధంతి వేడుకలు
సూర్య ఆర్మూర్ :ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు మిర్యాల్కర్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మిర్యాల్కర్‌ కిరణ్‌ మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వ సాధనకు మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వ భావనను పెంపొందించడంతో పాటు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ వివేకానంద, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి రంగన్న, జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, కిసాన్‌ మోర్చా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్‌, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్‌, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఉదయ్‌ గౌడ్‌, పట్టణ ఉపాధ్యక్షుడు దొండి ప్రకాష్‌, ఓబీసీ మోర్చా కార్యదర్శి పోహార్‌ నవీన్‌, బీజేపీ పట్టణ కార్యదర్శి పిట్ల శ్రీధర్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.