అట్టహాసంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం
సూర్య పెద్ద కోడపగల్ : పెద్ద కొడప్గల్ మండలంలోని బేగంపూర్ గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీఓ లక్ష్మీకాంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా తహసీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం కింద కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు.ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకంపై అవగాహన కలిగి ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ద వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు నాయకులు శ్యామప్ప, మహేందర్ రెడ్డి, మల్లప్ప పటేల్ స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు