BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు.. వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణకు 2030 లక్ష్యాలు

అసంపూర్తిగా నిలిచిన కమ్యూనిటీ హాల్ పనులు వెంటనే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

Select Suryaa Now
అసంపూర్తిగా నిలిచిన కమ్యూనిటీ హాల్ పనులు వెంటనే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

జీడిమెట్ల డివిజన్ వెస్ట్ ఎం.ఎన్.రెడ్డి నగర్‌లో పాదయాత్ర.. కాలనీవాసుల సమస్యలపై అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, అక్టోబర్ 12: జీడిమెట్ల డివిజన్ (132) వెస్ట్ ఎం.ఎన్.రెడ్డి నగర్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ విషయాన్ని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

పనులు వెంటనే చేపట్టాలని ఆదేశం

కాలనీవాసుల విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే వివేకానంద్, కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసి భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, చీఫ్ అడ్వైజర్ రాముడు యాదవ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రిష్ణ పటేల్, కోశాధికారి రాజు, కాలనీ యూత్ అధ్యక్షుడు రాజు యాదవ్, కాలనీవాసులు మురళి, బస్వరాజు, శేఖర్ గౌడ్, నర్సింహ, క్రిష్ణ, స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.