BREAKING
మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి... పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి పత్తి సాగుపై రైతులకు అవగాహన

అంగన్‌వాడీ టీచర్ల నియామకాలకు ఇంటర్వ్యూల తేదీలు ఖరారు

Select Suryaa Now
అంగన్‌వాడీ టీచర్ల నియామకాలకు ఇంటర్వ్యూల తేదీలు ఖరారు

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ల నియామక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్టిఫికెట్ల పరిశీలనలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి మెరిట్ ప్రాతిపదికన 1:3 నిష్పత్తిలో ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు.

జిల్లా కలెక్టర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 13న చేవెళ్ల, ఇబ్రహీంపట్నం డివిజన్ల అభ్యర్థులకు, 14న కందుకూరు, రాజేంద్రనగర్ డివిజన్ల అభ్యర్థులకు, 16న షాద్‌నగర్ డివిజన్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతి శ్రీ  బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత ప్రాజెక్టుల సీడీపీవోలు ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తారని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులందరూ తమకు కేటాయించిన తేదీన నిర్ణీత సమయానికి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

వడ్ల శ్రీనివాస చారి, రంగారెడ్డి - మేజర్ న్యూస్