అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం...
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం...
-ట్రాక్టర్ సీజ్
బెజ్జంకి/మేజర్ న్యూస్:
అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.ఈ ఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది.ఎస్సై తోట తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం బెజ్జంకి క్రాసింగ్ గ్రామం నుంచి మండల కేంద్రానికి వచ్చే రోడ్డు కల్వర్టు వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నారు.విచారణలో గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన బామండ్ల లక్ష్మణ్ అలియాస్ లచ్చయ్య తన ట్రాక్టర్ తో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.ఇసుకకు సంబంధించిన ఎటువంటి అధికారిక అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.సూర్యరిపోర్టర్ (బెజ్జంకి)