ఆరోగ్య శాఖ మంత్రికి ఆహ్వానం
సూర్య చొప్పదండి : చొప్పదండి పట్టణంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం కోసం రావాలని బుధవారం రోజున మినిష్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఆసుపత్రి ప్రారంభంతో చొప్పదండి మండలంతో పాటు చుట్టు పక్కల ఉన్న నాలుగు మండలాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వారి వెంట చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఫోరం అధ్యక్షులు గుర్రం సుజీత్ రెడ్డి తదితరులు ఉన్నారు.