ఆలయ ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే కు ఆహ్వానం
సూర్య- బిక్కనూర్ ;;మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభ ఉత్సవాలు డిసెంబర్ ఒకటవ తేదీ నుండి మూడు రోజులపాటు కొనసాగుతాయని, ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. దాతల సహాయంతో సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ నాగర్తి భూమిరెడ్డి, సభ్యులు జిల్లాల బాపురెడ్డి, వార్డు సభ్యుడు పెరిక రాజు తదితరులు ఉన్నారు