యువత స్వయం కృషితో ఎదగాలి
సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి
షాబాద్ : షాబాద్ మండలంలోని చిన్న సోలిపేట గ్రామానికి చెందిన ప్రహ్లాద రెడ్డి శంషాబాద్ మండలం వెంకటాపూర్ గేట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌ను ఆదివారం షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి సూపర్ మార్కెట్‌ను ప్రారంభించడంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ నిర్వాహకుడు ప్రహ్లాద రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ద్వారా వినియోగదారులకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార రంగంలో రాణిస్తూ మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, గ్రామస్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11)