BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం - స్వయంగా భోజనం వడ్డించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

Select Suryaa Now
వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం  - స్వయంగా భోజనం వడ్డించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
సూర్య, ఆర్మూర్:
వృద్ధుల పట్ల ఆప్యాయత, మానవీయ విలువలు, సామాజిక బాధ్యతను చాటుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్ గ్రామంలో ఉన్న లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న సుమారు 60 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, అవసరాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్, స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించారు. వారితో కొంతసేపు గడుపుతూ వారి అనుభవాలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.
 *వృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత* 
వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా వారి అవసరాలను గుర్తించి అండగా నిలవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. వృద్ధాప్యంలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజం నుంచి ప్రేమ, గౌరవం, సహకారం అవసరమన్నారు. వృద్ధుల సమస్యలను ఓపికగా విని, వారికి తగిన సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల జీవన పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, అవసరమైన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
వృద్ధులకు వైద్య పరీక్షలు
కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులు వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు. పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవ, మానవీయ విలువల పెంపునకు కూడా ప్రాధాన్యం ఇస్తోందనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణగౌడ్, ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి, వైద్యులు డాక్టర్ శంకర్ (పీడియాట్రిక్), డాక్టర్ మధుశేఖర్ (జనరల్ సర్జన్), డాక్టర్ వంశీ (డయాబెటిక్), డాక్టర్ ముత్యంరెడ్డి (జనరల్ సర్జన్), డాక్టర్ లింగారెడ్డి (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ ధనపాల్ సదన్ (డెంటల్)తో పాటు వృద్ధాశ్రమ నిర్వాహకులు సునీత, నాగమణి, దామోదర్‌రెడ్డి, సంకీత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.