BREAKING
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బుడ్డే హనుమంతరెడ్డికి మెట్టు విశ్వనాథ్‌రెడ్డి నివాళులు ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి

వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత

Select Suryaa Now
వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేయలి - - ఎఫ్ డీ వో కడారి అనిత

సూర్య  ఖానాపూర్ :నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి 8 వరకు నిర్వహించే వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎఫ్ డీ వో కడారి అనిత జెండా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది కార్యాలయం నుండి కొమురం భీం చౌరస్తా మీదుగా తర్లపాడు,సత్తెనపల్లి,దిలావర్పూర్, ఖానాపూర్ వరకు ర్యాలీ చేపట్టి వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.అంతకుముందు ఎన్టీఆర్ చౌరస్తా, తర్లపాడులో మానవహారం పాటించి వన్య ప్రాణుల మనుగడ పెంపొందించాలని అవగాహన కల్పించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎఫ్ డీ వో కడారి అనిత మాట్లాడుతూ, వన్యప్రాణులను హతమార్చినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వన్యప్రాణుల మనుగడకు ప్రతి ఒక్కరు కృషి చేస్తూ అటవీ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎఫ్ ఆర్ వో కిరణ్ కుమార్, ఖానాపూర్ డివిజన్ పరిధిలోని కడెం, పెంబి, దస్తురాబాద్, మామడ మండలాల ఎఫ్ ఎస్ వో లు, బీట్ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.