BREAKING
టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఒకే రోజులో 10 సాధారణ ప్రసవాలు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్..

Select Suryaa Now
రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్..

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాయలసీమను ఉద్యాన రంగంలో ప్రపంచ పటంపై నిలబెట్టే బాధ్యత తమదేనని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మదనపల్లెకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని గుర్తుచేసిన లోకేష్, గాంధీ జయంతి రోజున ఇక్కడ మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ హబ్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రూ.లక్ష కోట్ల ప్రణాళికతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎన్నో పండ్ల రకాలను ఇక్కడే పండించే సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఉత్పాదకత పెంపు, కోల్డ్ స్టోరేజీ, ప్యాకేజింగ్, యాంత్రీకరణ, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని వివరించారు.

ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశీ మార్కెట్లకు అవసరమైన మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్ వంటి మేలైన రకాలను పండించి రాయలసీమ రైతు సత్తాను ప్రపంచానికి చాటిచెబుతామని లోకేష్ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా విత్తనం నుంచి ఉత్పత్తి, మార్కెటింగ్ వరకు అన్ని దశల్లో పరిశోధనలు జరుగుతాయని, ఈ సంస్థ రైతుల కోసం ప్రపంచస్థాయి సంస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యువగళం పాదయాత్రలో భాగంగా రాయలసీమలో 124 రోజుల పాటు పర్యటించినప్పుడు రైతుల కష్టాలను దగ్గరగా చూశానని లోకేష్ గుర్తుచేసుకున్నారు. ఆ అనుభవం నుంచే మిషన్ రాయలసీమ ఆలోచన పుట్టిందని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు రిలయన్స్ ప్రతినిధి అనంత్ అంబానీ పాల్గొన్నారు. మదనపల్లె కేంద్రంగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టుతో రాయలసీమ రైతులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని నేతలు అభిప్రాయపడ్డారు.