BREAKING
గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

గాంధీ విగ్రహానికి టీయూడబ్ల్యూజే  (ఐజేయు) వినతి*

వరంగల్ టౌన్, అక్టోబర్ 2 ,మేజర్ న్యూస్ సూర్య,


జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ శుక్రవారం టి యూ డబ్ల్యూ జే ఐ జేయు జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామచందర్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జాతీయ కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
గ్రేటర్ వరంగల్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జాతీయ కమిటీ తీర్మానం మేరకు "పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ దినం"గా జిల్లా కమిటీ విజయవంతంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా *జాతీయ కౌన్సిల్ సభ్యుడు సంగోజు రవి* మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సదుపాయాలు, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యాన్ని అమలు చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. వరంగల్ తూర్పులో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రాంచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర నాయకత్వం అడుగుజాడల్లో జిల్లా కమిటీలు ముందుకు సాగుతున్నాయన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగానే గాంధీకి లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్, కోశాధికారి కొదాటి గోపాలకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు కందుల శ్రీధర్, ఉపాధ్యక్షులు జన్ను స్వామి, కూర్ణ వెంకటేశ్వర్లు, మహాదేవుని జగదీష్, సహాయ కార్యదర్శులు బొమ్మగాని సతీష్, చింతనూరి రాజు, బానోత్ బాలాజీ, కార్యవర్గ సభ్యులు హుస్సేన్ పాషా, అక్రమ్, బాబర్, దేసు లక్ష్మణ్, కందుల శ్రీనివాస్, గాదె రవి, శీలం రమేష్, సీనియర్ జర్నలిస్టులు పెరుమాండ్ల మధు, ఎండీ సయీద్, సామల సూర్య ప్రకాష్, వలిశెట్టి సుధాకర్, ఏలుగందుల అజయ్, చిన్నబాబు, చైతన్య, సాజిద్ పాషా, నితీష్, అమీర్, చిట్టిబాబు, మురళి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.