BREAKING
ప్రజాదర్బార్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల గాంధీ జయంతి స్ఫూర్తితో సుందరమైన తిరుపతిని నిర్మిద్దాం సేవా భావంతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఏలూరి గత 50 ఏళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం… శ్రీకాకుళంలో అల్యూమినియం స్మెల్టర్ - కిషన్ రెడ్డిని కోరిన రామ్మోహన్ నాయుడు.. రాజం పట్టణం చెవిటి మూగ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్లుజే (ఐజేయూ) నిరసన ముంబై మిథీ నది కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు డినో మోరియా అరెస్ట్.. రూ. 65 కోట్లకు పైగా స్కామ్! కేసరపల్లిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ , ఎస్పీ , కమిషనర్ ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడిస్తే మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పులు ఇవే! వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ డోలి సత్యనారాయణ గంగపుత్ర పేరును ప్రకటించాలి నెల్లూరు నగరంలో తొలి స్టేడియానికి శ్రీకారం.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి నారాయణ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆచరించాలి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తేవాలి

కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Select Suryaa Now
కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

తిరుపతి జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంధమనేని శివయ్య భవన్ లో గురువారం జరిగిన ఏపీ రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే నిర్వహించి మండలాల వారీగా పంట నష్టం అంచనా వేయాలన్నారు. పంటలు సాగు చేయలేక, సాగు చేసిన పంటలకు నీరు అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కరువు ప్రకటనలో ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మునిరత్నం, జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గోవిందయ్య, సహాయ కార్యదర్శి పద్మనాభ రెడ్డి, నాయకులు రాము పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి